
విజయవాడ , 15 అక్టోబర్ (హి.స.)దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి
భారీ కానుక అందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ భక్తుడు సుమారు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి విరాళంగా సమర్పించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడైన కె. దుర్గా శ్రీనివాస్ ఈ కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. 494 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన ఈ కిరీటంలో ఎరుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల నవరత్నాలను పొదిగారు. దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గా శ్రీనివాస్ ఈ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనానాయక్ కు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్