ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ఎంతో అవసరం.. కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ఎంతో అవసరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
Collector


జోగులాంబ గద్వాల, 15 అక్టోబర్ (హి.స.)

ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ఎంతో అవసరమని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఉపాధ్యాయులు ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బెస్ట్ ఆన్లైన్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కొంతకాలంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్లైన్లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఒకరోజు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ద్వారా బోధనలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మార్గదర్శకత్వం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande