
అమ్మ, 15 అక్టోబర్ (హి.స.)
పోలీస్ సిబ్బంది తమ కంటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమానికి పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
గురువారం ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో భాగంగా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు శారీరక ఆరోగ్యంతో పాటు కంటి చూపు కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కంటి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను నివారించవచ్చని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..