
వరంగల్, 15 అక్టోబర్ (హి.స.)
ఆధునిక హక్కులతో వరంగల్ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈనెల 20న దసరా సందర్భంగా సాఫ్ట్ లాంచ్ చేసి ఓపీని ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మంత్రి ధనసరి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పోరిక బలరాం నాయక్ లతో కలిసి అధికారులతో సాఫ్ట్ లాంచ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉండే ఎంజీఎం హాస్పిటల్ గత కొన్ని దశాబ్దాలుగా పలు ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు అందించింది అదే నమ్మకంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైన తర్వాత ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు