అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
మాజీ రాష్ట్రపతి, మిస్సల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
Mla


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) మాజీ రాష్ట్రపతి, మిస్సల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. నేడు దివంగత రాష్ట్రపతి కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కలాం కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

అబ్దుల్ కలాం అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. తన ప్రతిభతో ఎన్నో ఆవిష్కరణలు చేసి రక్షణ రంగంలో భారతదేశం సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారనన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande