తాగునీటి సమస్యలపై చర్యలు.. చీఫ్ సెక్రటరీ
తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.
Secretary


సంగారెడ్డి, 15 అక్టోబర్ (హి.స.) తాగునీటి సమస్యలు

తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.

గురువారం పుల్ కల్ మండలం సింగూరు ప్రాజెక్టును, పెద్దారెడ్డిపేట వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పరిశీలించారు.

సింగూర్ ప్రాజెక్టు నీటి మట్టం, లభ్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో త్రాగు నీటి లభ్యత, వర్షపాతం నమోదు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సీఎస్ కు వివరించారు.

అనంతరం సీఎస్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి లభ్యత, వర్షపాతం నమోదు, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande