సరస్ మేళా.. డ్వాక్రా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం : చంద్రబాబు
మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తెచ్చే 'స్వయం ఏపీ'
చంద్రబాబు


విజయవాడ, 15 అక్టోబర్ (హి.స.) మహిళల్ని ఎంట్రప్రెన్యూర్లుగా మార్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తెచ్చే 'స్వయం ఏపీ' బ్రాండ్పై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడలో ఈ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ తర్వాత తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అటు దుర్గమ్మ, ఇటు కృష్ణమ్మ పరవళ్ల చెంతన సరస్ మేళాను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. పేద కుటుంబంలో పుట్టిన ముర్ము ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించారని.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారన్నారు. సంకల్పంతో ఎదిగిన ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని వెల్లడించారు. మహిళలు సంకల్పిస్తే ఎంత ఉన్నత శిఖరాలు అయినా అధిరోహిస్తారని నిరూపించారని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ప్రారంభించిన డ్వాక్రా ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 650 స్టాళ్లు మహిళల నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, కొత్త వ్యాపార అవకాశాలు సృష్టించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ ఉత్పత్తులు జాతీయ ఉత్పత్తులుగా మారాలని ఆకాంక్షించారు.త్వరలోనే పది లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆరు కోట్ల మందిని వ్యాపారవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఆయన స్ఫూర్తి ప్రశంసనీయమని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande