బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకున్న 6.47 లక్షల మంది భక్తులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల రాకతో వైభవంగా కొనసాగాయి. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో 6.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Temple


అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల రాకతో వైభవంగా కొనసాగాయి.

తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో 6.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ 8 రోజుల్లో తిరుమలలోని హుండీ ద్వారా రూ. 25.8 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాకుండా ఈ 8 రోజుల వ్యవధిలో 2.44 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. ప్రతి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల పరిసరాలు మార్మోగాయి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో క్యూలైన్లను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande