ఎమ్మెల్సీ ఎన్నికలకు కవిత పార్టీ తొలి అభ్యర్థి ప్రకటన
ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు తమ బలాన్ని పరీక్షించుకునే అవకాశంగా నిలుస్తాయి.
K Kavitha


హైదరాబాద్ , 20 అక్టోబర్ (హి.స.)ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు తమ బలాన్ని పరీక్షించుకునే అవకాశంగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో కవిత పార్టీ ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయదశమి పండుగ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని, రాబోయే వరంగల్ - ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ను ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఖరారు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ కో-ఆర్డినేటర్, అబ్జర్వర్గా సయ్యద్ ఇస్మాయిల్ను నియమిస్తూ తక్షణ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, కొత్త పార్టీగా ప్రజల్లో గుర్తింపు పెంచుకోవడం కూడా కవిత పార్టీకి ముఖ్యమైన అంశం కానుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులతో పోటీ ఎలా ఉండబోతోందన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande