కొండారెడ్డిపల్లిలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో నేడు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.
Cm


హైదరాబాద్ , 20 అక్టోబర్ (హి.స.)నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో నేడు దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హెలికాఫ్టర్ లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో భారీగా హాజరైన కార్యకర్తలను పలకరించుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చారు. దారిపొడుగునా గజమాలలు, పూలవర్షంతో కార్యకర్తలు, స్థానికులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande