పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్
పండుగల సమయంలో సంప్రదాయాలను పాటించడంతోపాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.
SAJANAR


హైదరాబాద్ , 20 అక్టోబర్ (హి.స.)పండుగల సమయంలో సంప్రదాయాలను పాటించడంతోపాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు. పాలపిట్టలను బంధించకుండా వాటిని స్వేచ్ఛగా చూడాలని, వాటి జీవనానికి ఆటంకం కలిగించవద్దని కోరారు. పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకంతో కొందరు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ సంప్రదాయం పేరుతో పక్షులను బంధించడం, వాటిని ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పక్షులను వాటి సహజ ఆవాసాల్లో స్వేచ్ఛగా జీవించనివ్వాలని సూచిస్తున్నారు.

పాలపిట్టలను పట్టుకుని విక్రయించడం, ఇతరులకు అప్పగించడం లేదా వాటిని బోనుల్లో ఉంచడం వంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా యువత, పిల్లలకు పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande