
హైదరాబాద్ , 20 అక్టోబర్ (హి.స.)ఇంద్రకీలాద్రిపై మహా పూర్ణాహుతితో దిగ్విజయంగా దసరా మహాత్సవములు ముగిశాయి. అయితే నేడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన సమయంలో ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న మంత్రి, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, పూజా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా అధికారులు పర్యవేక్షించారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్