
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) దసరా పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధాలకు, మోటార్ ట్రాన్స్పోర్ట్ (ఎం.టీ.) విభాగంలో పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్, తన సతీమణి స్నేహా శబరీష్, ఐఏఎస్‌తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినం ధర్మానికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకగా నిలిచే పండుగ అని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలు తమ లక్ష్యాలను సాధిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ విధుల్లో కీలకమైన ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..