
అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా కల్పించడంతో పాటు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని సంబంధిత విభాగాలు తగిన ఏర్పాట్లు చేశాము అని అన్నారు.
ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరించిన పోలీసు శాఖ, వివిధ ప్రభుత్వ విభాగాలు, టీటీడీ ఉద్యోగులు, సేవకులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది చేసిన కృషిని అభినందించారు.
తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు దర్శన ఏర్పాట్లను మరింత మెరుగుపరచడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రముఖ ఉత్సవాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్