వైద్యం, విద్యకు సమాజంలో ఎంతో ప్రాధాన్యం.. కలెక్టర్ గరిమ అగర్వాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీకి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గితె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Collector


రాజన్న సిరిసిల్ల, 24 అక్టోబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీకి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గితె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు వైట్ కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా ఎదిగి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

వైద్యం, విద్యకు సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. నీట్లో ఉత్తీర్ణత సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందడం వెనుక విద్యార్థుల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. వైద్యులు గర్భిణులు, చిన్నారులు, వివిధ వ్యాధులతో బాధపడేవారికి ఓర్పుతో సేవలు అందించాలని సూచించారు.

సమాజ సేవలో భాగంగా అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించి ఆత్మసంతృప్తి పొందాలని, తమ ఆరోగ్యం, ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, బాలుర హాస్టల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande