మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాలలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు.
Collector


జగిత్యాల, 24 అక్టోబర్ (హి.స.)

జగిత్యాలలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వారు కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి, పురోగతిని సమీక్షించారు.

కళాశాల భవనంతో పాటు హాస్టల్ బ్లాక్, కిచెన్, తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే జిల్లాలో వైద్య విద్య అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande