పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు.. జగిత్యాల ఎమ్మెల్యే
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి సదుపాయాలను ఒకే ప్రాంగణంలో కల్పించడమే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
Mla


జగిత్యాల, 24 అక్టోబర్ (హి.స.)

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి సదుపాయాలను ఒకే ప్రాంగణంలో కల్పించడమే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలోని మొరపల్లి శివారులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమిపూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్న ఈ స్కూల్ నందు సుసుమారు 2,500 మంది విద్యార్థులు, 500 మంది సిబ్బందికి అనుగుణంగా ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande