
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)
ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా ఉపయోగించు కుంటుందని, సీబీఐ, ఈడీలను ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు.
శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
అడ్వకేట్ వృత్తి గౌరవప్రదమైనదని, అదే సమయంలో ఎంతో కష్టంతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. తాను కూడా అడ్వకేట్ కావాలనుకున్నానని, అయితే ఆ అవకాశం దక్కలేదని తెలిపారు.
న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన పలువురు రాజకీయాల్లో రాణించారని చెప్పారు.న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషిదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు