బోడుప్పల్ లో కొత్త బస్ టెర్మినల్కు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ లో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ బస్ టెర్మినల్కు మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేశారు.
Minister


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ లో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ బస్ టెర్మినల్కు మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేశారు.

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో బోడుప్పల్లో కొత్త సిటీ బస్సు టర్మినల్ నిర్మిస్తున్నామని రవాణా శాఖ మంత్రి తెలిపారు.

రోజుకు సుమారు సుమారు లక్ష మంది ప్రయాణికులకు సేవలందించేలా ఆధునిక సదుపాయాలతో ఈ టెర్మినల్ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఫిర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాల పేర్లతోనే కొత్త బస్ స్టేషన్కు నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యంతో పాటు సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 3,000కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని, త్వరలోనే మరో 2,200 ఎలక్ట్రిక్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande