
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు సూచించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, వాటి పనితీరును సమీక్షించారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధరణి సేవలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ, పెండింగ్ ఫైళ్ల వివరాలపై ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్వరమే సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యాలయానికి సంబంధించిన రికార్డులన్నింటినీ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..