
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీని కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా విబి రాంజీ పథకం కింద ఉపాధి పనులకు కూలీలందరూ హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. రాబోయే రోజుల్లో ఏలినో ప్రభావం వల్ల కలిగే నష్టాలు, వాటి ప్రభావాలను ఎదుర్కొనే అంశాలపై కూలీలకు ఆమె అవగాహన కల్పించారు.
అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మహిళా భవనం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులను అధికారులు పరిశీలించారు.
నిర్మాణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..