తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్లదాడి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Police


అనంతపురం , 25 అక్టోబర్ (హి.స.)

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామంలో ఇద్దరు టీడీపీ నాయకులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వైఎస్సార్సీపీ నాయకులు తాడిపత్రికి చేరుకున్నారు. అనంతరం పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, అక్కడి నుంచి టీడీపీ వర్గీయులపై రాళ్లు రువ్విరు.

దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి పరస్పర రాళ్లదాడికి దారితీసింది. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఘర్షణ మరింత విస్తరించకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో తాడిపత్రిలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande