
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగర పరిధిలో నిత్యం ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడు రవాణా సంస్థ శుభవార్తను ప్రకటించింది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం మరియు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందించడం అనే లక్ష్యాలతో కొత్తగా రూ.600 ధరకే 'వీక్లీ బస్ పాస్' సదుపాయాన్ని సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్ పొందిన వారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సిటీ బస్సులలో, ఏడు రోజుల వరకు పరిమితి లేకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
వీక్లీ బస్ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుండి వరుసగా ఏడు రోజుల వరకు దీనిని ఉపయోగించవచ్చు. ఈ పాస్ సాధారణ సిటీ బస్సులతో పాటు, ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులలో కూడా చెల్లుబాటు అవుతుందనీ
టీజీఎస్ఆర్టిసి విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..