తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ఓకే.. సీఎం రేవంత్ రెడ్డి
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.
Cm


తుమ్మిడిహెట్టి , 26 అక్టోబర్ (హి.స.)

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఫడణవీస్కు వివరించినట్లు తెలిపారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు సంబంధించి సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. సోమవారం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ నిర్వహించారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆదిలాబాద్ ప్రాంత సాగునీటి అవసరాలు, ముంపు ప్రభావంపై అధికారులు అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారని ఇరు రాష్ట్రాల నేతలు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande