
నాగర్కర్నూల్, 26 అక్టోబర్ (హి.స.)
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామంలో పర్యటించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి మొదలగు అంశాలను ఈ పర్యటన సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు.
గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రం, కాటన్ మిల్లుతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు