తుఫాను బాధితులకు నేరుగా భరోసా: నేడు కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు!
తుఫాను బాధితులకు నేరుగా భరోసా: నేడు కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు!
చంద్రబాబు


అమరావతి: 29 అక్టోబర్ (హి.స.)

'ఆర్నబ్' తుఫాను వల్ల పంటలు, ఇళ్లు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన ప్రజలను, రైతులను నేరుగా కలిసి భరోసానిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. గురువారం (అక్టోబర్ 29) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆయన నేటి అధికారిక పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

సీఎం చంద్రబాబు నేటి అధికారిక షెడ్యూల్ వివరాలు:

-

ఉదయం 10:30 గంటలకు: అమరావతి నుంచి ఆన్‌లైన్/హైబ్రిడ్ విధానంలో కేబినెట్ అత్యవసర సమావేశంలో పాల్గొంటారు. తుఫాను సహాయక చర్యలు, నష్టపరిహార ప్యాకేజీ అమలుపై మంత్రులు, అధికారులతో సమీక్షిస్తారు.

-

మధ్యాహ్నం 12:10 గంటలకు: క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్తారు.

-

మధ్యాహ్నం 12:55 గంటలకు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనిక Ona మండలం చెయ్యేరు గ్రామానికి చేరుకుంటారు.

-

మధ్యాహ్నం 1:10 గంటలకు: చెయ్యేరు గ్రామంలో తుఫాను వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి, దెబ్బతిన్న ఇళ్లను సందర్శిస్తారు. అనంతరం స్థానిక రైతులతో, తుఫాను బాధితులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సహాయంపై వారికి భరోసానిస్తారు.

-

సాయంత్రం 4:25 గంటలకు: తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటన ముగించుకుని తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సహాయక ప్యాకేజీ క్షేత్రస్థాయిలో అందుతున్న తీరును పరిశీలించడంతో పాటు, రైతులకు తక్షణ పరిహారం అందించడమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande