
అమరావతి, 03 అక్టోబర్ (హి.స.)
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని మంత్రి నారాయణ తెలిపారు.
రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామని.. పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
కేంద్ర నిధులతో గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు.
గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ