ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం...ఒకరి మృతి
ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం...ఒకరి మృతి..మరొకరికి తీవ్రగాయాలు
accident


విజయవాడ, 03 అక్టోబర్ (హి.స.)

విజయవాడలోని నోవాటెల్ హోటల్ సమీపంలో ఫ్లైఓవర్పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బెంజ్ సర్కిల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న రామలింగేశ్వర్ నగర్కు చెందిన బత్తిన అమర్ సందీప్(34) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి బెల్లంకొండ గౌతమ్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అమర్ సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande