హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Rain


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షం ప్రారంభమైంది. తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, మణికొండ, రాయదుర్గం, షేక్పేట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అదేవిధంగా కాప్రా, కీసర, నాగారం ప్రాంతాల్లోనూ వర్షపు జల్లులు కురుస్తున్నాయి.

నగరంలోని టోలిచౌకి, లంగర్హౌస్, కార్వాన్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వర్షం నమోదవుతోంది. రహమత్నగర్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్తో పాటు జూబ్లీహిల్స్ పరిధిలోని కార్మికనగర్, శ్రీరామ్నగర్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.

ఒక్కసారిగా వర్షం కురవడంతో బయటకు వెళ్లిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షపు నీటి నిల్వల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande