శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ కలకలం
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Chennai airport


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పీఎన్ఆర్ నంబర్తో దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తిని విమానాశ్రయ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. టికెట్ తనిఖీల సమయంలో పీఎన్ఆర్ నంబర్ చెల్లుబాటు కాకపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.

విచారణలో భాగంగా సదరు ప్రయాణికుడిని అధికారులు ప్రశ్నించగా, దుబాయ్లో ఉంటున్న ఓ ఏజెంట్ తనకు విమాన టికెట్ పంపినట్లు వెల్లడించినట్లు సమాచారం. ఆ టికెట్ నిజమైనదని నమ్మి విమాన ప్రయాణానికి సిద్ధమై విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపాడు. అయితే తనిఖీల్లో టికెట్ నకిలీదని తేలడంతో ప్రయాణం సాధ్యం కాలేదు. అనంతరం అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.

ఈ వ్యవహారంలో దుబాయ్కు చెందిన ఏజెంట్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడి సమాచారంతో సదరు ఏజెంట్పై ఆన్లైన్లో కేసు నమోదు చేశారు. నకిలీ టికెట్ల ద్వారా ప్రయాణికులను మోసం చేస్తున్నారా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. విమాన టికెట్లు కొనుగోలు చేసే సమయంలో గుర్తింపు పొందిన సంస్థలు, అధికారిక వెబ్సైట్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande