ఆస్ట్రేలియాకు తాండూరు కందిపప్పు: అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ వ్యవసాయం
తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రత్యేక రుచికి, గుణగణాలకు పేరుగాంచిన ప్రసిద్ధ 'తాండూరు కందిపప్పు' విదేశీ గడ్డపై అడుగుపెట్టింది.
Agricultural


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రత్యేక రుచికి, గుణగణాలకు పేరుగాంచిన ప్రసిద్ధ 'తాండూరు కందిపప్పు' విదేశీ గడ్డపై అడుగుపెట్టింది. భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందిన ఈ కందిపప్పును తొలిసారిగా ఆస్ట్రేలియా దేశానికి ఎగుమతి చేశారు. దాదాపు 2.5 మెట్రిక్ టన్నుల కందిపప్పుతో కూడిన మొదటి సరుకును ఆస్ట్రేలియాకు పంపినట్లు అధికారులు తెలిపారు.

ఈ శుభవార్తపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. మన దేశ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో గుర్తింపు పెరగడం శుభపరిణామమని, విదేశీ ఎగుమతుల వల్ల స్థానిక రైతులు, వ్యాపారుల ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande