
అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరియు పోలింగ్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు) మరియు 87 పురపాలక సంఘాల్లో (మున్సిపాలిటీలు) ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు మరియు ఇతర సామగ్రి పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 4,372 పోలింగ్ కేంద్రాల పరిధిలో సుమారు 36,351 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు. భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, మరో 1,233 సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. పరిస్థితిని నిరంతరం సమీక్షించేందుకు డ్రోన్ కెమెరాలు మరియు సీసీటీవీల సాంకేతిక సహాయం తీసుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి 1,543 రూట్ మొబైల్ బృందాలను రంగంలోకి దించారు. ఓటింగ్ పూర్తయ్యాక సమాగ్రాన్ని భద్రపరిచే 111 స్ట్రాంగ్ రూమ్ల వద్ద 4,655 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో ఇప్పటివరకు 107 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించి, నవంబర్ 3న ఓట్ల లెక్లింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi