తుపాను నష్టాల పరిశీలనకు నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్లో తుపాను ప్రభావంతో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది.
Rain


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో తుపాను ప్రభావంతో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది. నేడు, రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో జరిగిన నష్టాలను అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం రాష్ట్రానికి చేరుకోనుంది. తొలుత ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమావేశమై తుపాను సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, జరిగిన నష్టం, ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై వివరాలు తెలుసుకోనుంది.

అనంతరం కేంద్ర బృందం రెండు విభాగాలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనుంది. మొదటి బృందంతో ఆర్టీజీఎస్ సీఈవో, ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెళ్లనుండగా, రెండో బృందానికి సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబు నేతృత్వం వహించనున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు, పంటలు, మౌలిక సదుపాయాల నష్టాన్ని పరిశీలించి వివరాలు సేకరించనున్నారు.

ఈ పర్యటనలో సేకరించిన వివరాల ఆధారంగా కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర బృందం సమావేశమై తుపాను నష్టాలు, సహాయక చర్యలపై చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande