ఏపీ కార్పొరేషన్లలో టీడీపీ హవా.. పలు డివిజన్లు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లోని పలు నగరపాలక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఏకగ్రీవ విజయాలు దక్కాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పలు కార్పొరేషన్లలో గణనీయమైన సంఖ్యలో డివిజన్లను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
CHITTOR MUNICIPAL


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని పలు నగరపాలక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఏకగ్రీవ విజయాలు దక్కాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పలు కార్పొరేషన్లలో గణనీయమైన సంఖ్యలో డివిజన్లను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చిత్తూరు కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు గాను టీడీపీ 47, జనసేన 2 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. బీజేపీ, వైఎస్సార్సీపీ కూడా ఒక్కో డివిజన్లో ఏకగ్రీవ విజయాన్ని సాధించాయి.

కడప కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు గాను టీడీపీ 47 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, జనసేన ఒకటి, బీజేపీ రెండు డివిజన్లలో విజయం సాధించాయి. నెల్లూరు కార్పొరేషన్లో 72 డివిజన్లకు గాను టీడీపీ ఎనిమిది స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.

ఇక విజయవాడలోని 86 డివిజన్లలో ఒకటి, ఒంగోలులోని 62 డివిజన్లలో మూడు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి. కర్నూలు కార్పొరేషన్లో 68 డివిజన్లకు గాను ఒకటి, తిరుపతిలోని 66 డివిజన్లలో రెండు డివిజన్లను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ ఫలితాలతో పలు కార్పొరేషన్లలో టీడీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన డివిజన్లలో ఎన్నికల పోరు కొనసాగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande