
అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానంతరం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో పటేల్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణానికి ఆయన బలమైన పునాదులు వేశారని సీఎం కొనియాడారు.
దేశ సమగ్రత, ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి, ధైర్యం, ఉక్కు సంకల్పం నేటి తరంతో పాటు భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టేందుకు పటేల్ చూపిన నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్