అర్నబ్ తుపాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
Chandrababu


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) కేంద్రంలో ఉన్నతాధికారులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన వాయుగుండం కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, దాని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉండవచ్చో ముందుగానే అంచనా వేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ, విపత్తుల నిర్వహణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande