
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
కేంద్ర హోం శాఖ
మంత్రి అమిత్ షా త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నారు.నవంబర్ 2వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన,
హైదరాబాద్‌లో పలు
కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు,
సమయ పట్టిక
ఖరారయ్యాయి.
పర్యటన వివరాలు:
·
మధ్యాహ్నం
02:00 గంటలకు:ప్రత్యేక
విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
·
మధ్యాహ్నం
02:15 నుండి
సాయంత్రం 04:00 వరకు:బేగంపేట
ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా కాకతీయ హోటల్‌కు చేరుకుని, అక్కడ కొంతసేపు బస చేస్తారు.
·
సాయంత్రం
04:00 గంటలకు:బాబూ
జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రాంతం నుండి ప్రారంభమయ్యే భారీ ర్యాలీలో పాల్గొంటారు.ఈ
ర్యాలీ ఎంజే మార్కెట్ వరకు కొనసాగనుంది.
కేంద్ర
హోంమంత్రి పర్యటన నేపధ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi