జూబ్లీహిల్స్లో డెలివరీ బాయ్ ఘరానా మోసం: రూ. 62 వేల విలువైన ఆభరణాలతో పరారీ
హైదరాబాద్లోని అభిజాత్య ప్రాంతమైన జూబ్లీహిల్స్లో ఒక నమ్మకద్రోహం ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్కు చెందిన బైక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, కస్టమర్కు అందజేయాల్సిన ఖరీదైన పార్శిల్ను దొంగిలించి పరారయ్యాడు.
PALARIVATTOM ROBBERY


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లోని అభిజాత్య ప్రాంతమైన జూబ్లీహిల్స్లో ఒక నమ్మకద్రోహం ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్కు చెందిన బైక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, కస్టమర్కు అందజేయాల్సిన ఖరీదైన పార్శిల్ను దొంగిలించి పరారయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో నివసించే ఒక వ్యాపారవేత్త ఆన్లైన్ ద్వారా రూ. 62,383 విలువైన బంగారు ఆభరణాన్ని ఆర్డర్ చేశారు. పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్, గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ను నమ్మించి ఓటీపీ (OTP) నమోదు చేయించుకున్నాడు. అయితే, పార్శిల్ను యజమానికి నేరుగా ఇవ్వకుండా, అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నట్లు నటిస్తూ సెక్యూరిటీ కళ్లుగప్పి తన బైక్పై ఆభరణాల పార్శిల్తో పరారయ్యాడు.

ఎంతసేపటికీ డెలివరీ కాకపోవడంతో కస్టమర్ పరిశీలించగా, మొబైల్కు 'డెలివరీ సక్సెస్' అని మెసేజ్ రావడంతో విషయాన్ని గ్రహించి సెక్యూరిటీ గార్డును విచారించారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, సదరు డెలివరీ బాయ్ ఐడీ, నిఘా కెమెరా (CCTV) దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande