జీహెచ్ఎంసీ శైలిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం: లేఅవుట్ అనుమతులపై కీలక ప్రశ్నలు
హైదరాబాద్ మహానగరంలో లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియ మరియు తదనంతరం జరుగుతున్న కూల్చివేతల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ts highcourt


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ మహానగరంలో లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియ మరియు తదనంతరం జరుగుతున్న కూల్చివేతల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ప్లాట్లకు అనుమతులు ఇచ్చి, లేఅవుట్లను క్రమబద్ధీకరించిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులే స్వయంగా వాటిని ఆక్రమణలంటూ హెచ్వైడీఆర్ఏఏ (HYDRAA) మరియు రెవెన్యూ శాఖలకు లేఖలు రాయడం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది.

భవన నిర్మాణాలు పూర్తయి ప్రజలు నివాసం ఉంటున్న సమయంలో అనుమతులు చెల్లవని అనడం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ అధికారులు తొలి దశలోనే అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని, అనుమతులు ఇచ్చేటప్పుడు చట్టపరమైన పరిశీలనలు ఎందుకు చేయడం లేదని నిలదీసింది.

భవన యజమానులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారని అభిప్రాయపడింది. లేఅవుట్ రికార్డులను, గతంలో ఇచ్చిన అనుమతుల ఫైళ్లను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande