కొమురెల్లి మల్లన్న ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Judge


సిద్దిపేట, 31 అక్టోబర్ (హి.స.) ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి ఈవో కట్టా సుధాకర్ రెడ్డి, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. సుదర్శన్, అదనపు జిల్లా న్యాయమూర్తి వై. జయప్రసాద్, చేర్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్, ఆలయ ఈవో బుద్ధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande