తుపాను బాధిత రాష్ట్రానికి ఎస్బీఐ రూ.5 కోట్ల విరాళం
అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి సహాయం అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది.
ત્રીજા ક્વાર્ટરમાં SBIનો નફો 13% વધીને રૂ. 21,317 કરોડ થયો


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి సహాయం అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తోడ్పాటునందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఎస్బీఐ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక, పునరావాస చర్యలను చేపడుతోంది. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించేందుకు నిధులు అవసరమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎస్బీఐ అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వానికి కొంతమేర తోడ్పడనుంది.

విరాళం చెక్కును స్వీకరించిన సీఎం చంద్రబాబు ఎస్బీఐ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విపత్తు సమయంలో సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి రాష్ట్రానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande