అమిత్ షా హైదరాబాద్ పర్యటన : క్షేత్రస్థాయి రూట్ పరిశీలించిన కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన భారీ 'మహాపాదయాత్ర' మరియు బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈరోజు స్వయంగా పరిశీలించారు.
kishan


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో నిర్వహించ తలపెట్టిన భారీ 'మహాపాదయాత్ర' మరియు బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈరోజు స్వయంగా పరిశీలించారు. పాదయాత్ర ప్రారంభమయ్యే బషీర్బాగ్ జంక్షన్, బాబు జగ్జీవన్రావ్ విగ్రహం ప్రాంగణం నుంచి మోజంజాహి మార్కెట్ వరకు ఉన్న ప్రతిపాదిత రూట్ను పార్టీ నాయకుడు రామచందర్రావు మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆయన కాలినడకన సందర్శించారు.

ఈ సందర్భంగా యాత్ర మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా ఏర్పాట్లు, మంచినీటి వసతి మరియు పబ్లిక్ పాయింట్ల వద్ద వేదికల నిర్వహణపై పార్టీ శ్రేణులకు మరియు పోలీస్ అధికారులకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు. నగరంలో వేలాది మంది కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

పాదయాత్ర విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలమైన ప్రజా పునాదిని చాటిచెబుతుందని నాయకులు వ్యాఖ్యానించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో హైదరాబాద్ నగర బిజెపి ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు మరియు కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande