జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో కీలక పురోగతి.. వేగం పెంచిన సీబీఐ కోర్టు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణలో కదలిక పెరిగింది.
ED


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణలో కదలిక పెరిగింది. ఈ కేసులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వరుసగా విచారణ చేపడుతోంది. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది.

ఇండియా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టు విచారణను పూర్తి చేసింది. ఇప్పటివరకు సీబీఐ దాఖలు చేసిన మొత్తం ఆరు ఛార్జ్షీట్లకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. తాజాగా భారతి సిమెంట్స్ కేసులోనూ ఈ తరహా పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. దీంతో ఈ కేసు కూడా తదుపరి దశకు చేరుకుంది.

మరోవైపు జగన్కు సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల విచారణ సైతం ప్రతిరోజూ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 45 డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో పెండింగ్లో ఉన్న కేసులపై న్యాయస్థానం మరింత దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. తదుపరి విచారణల్లో కోర్టు తీసుకునే నిర్ణయాలపై రాజకీయ, న్యాయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande