కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనను రద్దు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో చేపట్టాల్సిన పర్యటన అనూహ్యంగా రద్దయింది.
Amit Shah


హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో చేపట్టాల్సిన పర్యటన అనూహ్యంగా రద్దయింది. ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ ప్రాంతంలో సహకార డెయిరీ ప్లాంట్కు శంకుస్థాపన చేయడంతో పాటు కరీంనగర్లోని ఒక వైద్య విద్యా సంస్థ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని ముందుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ పోలీసులు, ఇతర భద్రతా విభాగాలు ఏర్పాట్లను పూర్తి చేశాయి. తూప్రాన్ మండలంలోని బ్రహ్మణపల్లిలో డెయిరీ ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం కోసం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, వేదికకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేపట్టారు. కరీంనగర్ కార్యక్రమానికి కూడా పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి.

ఢిల్లీలో అత్యవసర సమావేశం లేదా ఇతర ముఖ్యమైన అధికారిక కార్యక్రమం కారణంగా అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కొత్త పర్యటన తేదీని ఇంకా ప్రకటించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande