పిల్లల ఆన్లైన్ భద్రతకు ప్రత్యేక ఫ్రేమ్వర్క్.. AI దుర్వినియోగంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్చరిక
పిల్లలపై పెరుగుతున్న సైబర్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక Child Online Safety Framework రూపొందించేందుకు చర్యలు ప్రారంభించింది.
Child


హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)పిల్లలపై పెరుగుతున్న సైబర్ ముప్పులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక Child Online Safety Framework రూపొందించేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ గ్రూమింగ్, బ్లాక్మెయిల్, వేధింపులు వంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడానికి సమగ్ర విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదే సమయంలో హైదరాబాద్లో జరిగిన పిల్లల న్యాయ పరిరక్షణకు సంబంధించిన దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు సంబంధించిన అసభ్యకర లేదా హానికరమైన కంటెంట్ను AI సాంకేతికత ద్వారా సృష్టించడం వంటి కొత్త సవాళ్లు చట్ట అమలు సంస్థలు, సాంకేతిక సంస్థలు, న్యాయవ్యవస్థ ముందు సంక్లిష్ట సమస్యలను ఉంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

పిల్లల డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు, పాఠశాలలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒకవైపు పిల్లలకు ఇంటర్నెట్లో విద్య, సమాచారం, సృజనాత్మక అవకాశాలు లభిస్తున్నప్పటికీ మరోవైపు వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, నకిలీ ఖాతాలు, సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలు వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande