
హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో ప్రభుత్వ వైద్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఎల్బీనగర్, అల్వాల్ ప్రాంతాల్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
వైద్య భవనాలు నిర్మించడం మాత్రమే కాకుండా అవి ప్రారంభించే సమయానికి అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు, ఇతర సహాయక సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కొత్త ఆసుపత్రి భవనం సిద్ధమైన తర్వాత సిబ్బంది కొరత కారణంగా సేవలు ఆలస్యం కాకుండా ముందస్తు ప్రణాళిక అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్