
అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భవిష్యత్తులో గ్లోబల్ డీప్టెక్, నాలెడ్జ్ మరియు ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక ప్రణాళికను ప్రకటించింది. విజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక ప్రతిపాదనలను వెల్లడించారు.
రూ.500 కోట్ల పాన్-ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్, శాశ్వత పాన్-ఐఐటీ అమరావతి కౌన్సిల్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ రంగాలపై ప్రత్యేక దృష్టి ఉన్నాయి. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ‘మేక్ ఇన్ అమరావతి’ భావనతో ఐదు ‘Q-Shiva’ క్వాంటమ్ కంప్యూటర్లను ప్రదర్శించారు. నాలుగు కెల్విన్ ప్రాసెసర్తో కూడిన ఈ వ్యవస్థలను భవిష్యత్ క్వాంటమ్ టెస్టింగ్కు ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యాన్ని కూడా సీఎం వెల్లడించారు. 23 ఐఐటీలు, 25 ఇన్నోవేషన్ హబ్లు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, స్టార్టప్లను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడానికి పాన్-ఐఐటీ అమరావతి కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్