హార్టికల్చర్ హబ్పై జగన్ విమర్శలు
రాయలసీమలో ప్రతిపాదించిన రూ.1 లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.
Jagan


అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)రాయలసీమలో ప్రతిపాదించిన రూ.1 లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు తగిన బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ వ్యయం కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. జగన్ సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై స్పందించారు.

రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం, ముఖ్యంగా ఉద్యాన పంటల అభివృద్ధికి పెద్ద స్థాయిలో పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ఒకే ఎకోసిస్టమ్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను ప్రతిపాదించారు.

ప్రభుత్వం చెబుతున్న రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి వాస్తవ రూపంలోకి రావాలంటే స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు, అమలు రోడ్మ్యాప్ అవసరమని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande