ఏపీలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు.. కేంద్రమంత్రి ,సీఎం శంకుస్థాపన
మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. శంకుస్థాపన చేసిన సీఎం, కేంద్రమంత్రి
ఏపీలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..  కేంద్రమంత్రి ,సీఎం శంకుస్థాపన ..


తెనాలి , 04 అక్టోబర్ (హి.స.)పేదల సొంతింటి కలను నిజం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. వెయ్యికాదు.. లక్ష కాదు.. ఏకంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో భూమిపూజ శంకుస్థాపన చేశారు.

తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం, CSIR - CBRI, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలిసారిగా '3డీ కాంక్రీట్ ప్రింటింగ్' పరిజ్ఞానంతో 175 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కేంద్రమంత్రికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.

---------

------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande