
తిరుమల, 04 అక్టోబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
ఈ రోజు ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు సర్వదర్శనానికి 18-20 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. రూ.300 టోకెన్లు ఉన్నవారికి శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందినవారికి 5-7 గంటలు సమయం పడుతుందని వెల్లడించింది. శనివారం స్వామివారిని 91,296 మంది భక్తులు దర్శించుకోగా.. 32,805 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.5.06 కోట్లు సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV